Monday, April 29, 2024

Devara | రికార్డు ధరకు ‘దేవర‘ డిజిటల్ రైట్స్..

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక‌ సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జ‌రుగుతోంది.. ఈ మూవీ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం.

కాగా, ‘దేవర’ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మూవీకి సంబంధించి డిజిట‌ల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రికార్డు ధరకు దక్కించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ యాక్ష‌న్ డ్రామా మూవీని ఏకంగా రూ.150 కోట్లతో నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్టు స‌మాచారం. దాంతో పాటు ఆడియో రైట్స్ ని టీ సిరీస్ రూ.25 కోట్లతో ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో, ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘దేవర’ షూటింగ్ కంప్లీట్ కాకముందే బడ్జెట్ లో సంగం డబ్బులు వచ్చేయానే టాక్ న‌డుస్తోంది.

- Advertisement -

ఇక‌, ‘దేవర’ సినిమా విడుదలకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు 5 భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండ‌గా.. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement