Wednesday, September 18, 2024

హైదరాబాద్‌లో మహిళ దారుణహత్య

హైదరాబాద్ నగర శివారులోని చింత‌ల్‌లో దారుణ హ‌త్య జ‌రిగింది. చింత‌ల్‌లోని భ‌గ‌త్‌న‌గ‌ర్‌లో ఓ మ‌హిళ‌ను హ‌త్య‌చేసిన దుండగులు న‌గ‌లు ఎత్తుకెళ్లారు. నిన్న మ‌హిళ భ‌ర్త రోజువారీ విధుల‌ నిమిత్తం ఇంట్లో నుంచి వెళ్లిన త‌ర్వాత చొర‌బ‌డిన గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు.. ఒంట‌రిగా ఉన్న మ‌హిళ మెడకు ట‌వ‌ల్ చుట్టి ఊపిరాడ‌కుండా చేసి హ‌త్య చేశారు. అనంత‌రం సుమారు రూ.5 ల‌క్ష‌ల విలువైన న‌గలు ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత విష‌యాన్ని గుర్తించిన ఆమె భ‌ర్త జీడిమెట్ల పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement