Monday, February 19, 2024

TS | పాలేరు నుంచే పోటీ చేస్తా.. వైఎస్సార్​ బిడ్డగా మంచి పాలన అందిస్తా: ష‌ర్మిల‌

పాలేరు ప్రజల సాక్షిగా… పాలేరు మట్టి సాక్షిగా ఈ రాజశేఖరరెడ్డి బిడ్డ పాలేరుకు రాజశేఖరరెడ్డి గారి పాలనను అందిస్తానని మాట ఇచ్చిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని, అక్కడి నుండి పాలేరుకు వెళ్లారు. పాలేరులో వైఎస్ 74వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ష‌ర్మిల‌. ఈ సందర్భంగా మాట్లాడుతూ… త్వరలో పాలేరులో పాదయాత్రను ప్రారంభించి, ఇక్కడే ముగిస్తానని చెప్పారు.

రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీలతో దివంగత రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాలనను తీసుకు వస్తానని చెప్పారు ష‌ర్మిల‌. ‘‘నేను మళ్లీ చెబుతున్నా.. రాజశేఖరరెడ్డి బిడ్డను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తా”అని హామీ ఇచ్చారు షర్మిల. రాష్ట్రవ్యాప్తంగా 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని, అతికొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో కొనసాగించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి ఇక్కడే ముగిస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement