Saturday, June 22, 2024

Top Rank | ఇంటర్‌లో సత్తా చాటిన మ‌ల్లంప‌ల్లి స్టూడెంట్‌.. రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్‌

ములుగు, (ప్రభ న్యూస్ ప్రతినిధి): ఇంట‌ర్ సప్లమెంటరీ ఫ‌లితాల్లో ములుగు జిల్లా విద్యార్థిని స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. మల్లంపల్లి గ్రామానికి చెందిన సౌమ్య బైపీసీలో 440 మార్కులకు గాను 436 మార్కులు తెచ్చుకుంది. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకును సాధించింది. హనుమకొండలోని సిగ్మా జూనియర్ కాలేజీలో చదువుతున్న ఈ అమ్మాయి టాప్​ ర్యాంక్​ తెచ్చుకోవడంపై తల్లిదండ్రులు నరేంద్రచారి, శ్రీలత సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇక.. పదో తరగతిలో కూడా మల్లంపల్లిలోని ఓ ప్రైవేటు స్కూల్ లో చదివిన సౌమ్య 9.3 గ్రేడ్ సాధించింది. అదే విధంగా ఇంటర్ ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవడంపై ఉపాధ్యాయులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement