Thursday, April 25, 2024

వైట్ డ్రెస్ .. బ్లాక్ గ్లాసెస్ తో సూపర్ లుక్ లో.. బ్రహ్మానందం

సూపర్ లుక్ లో ముంబై ఎయిర్ పోర్టులో మీడియాకంట‌ప‌డ్డారు స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం. తెల్లటి దుస్తులు, నల్లటి కళ్లజోడును ధరించి ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా ఆయనను తమ కెమెరాల్లో బంధించారు. సార్ మాస్క్ తీయండని ఒకరు కోరగా ఆయన మాస్క్ ను తొలగించి, నవ్వులు చిందించారు. వెల్ కమ్ ముంబై సార్ అంటూ మరొక వ్యక్తి బ్రహ్మీకి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన ప‌లు చిత్రాలలో నటిస్తున్నారు. మైక్ టెస్టింగ్ 143, గజదొంగ, ఫీల్ మై లవ్, నిన్ను చూసిన క్షణాన, భవానీ ఐపీఎస్, వాల్ పోస్టర్ తో పాటు మరిన్ని చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement