Saturday, April 20, 2024

రిస్క్ చేశాన‌ని అంటున్నారు – సుధీర్ బాబు

సుధీర్‌ బాబు కథానాయకుడిగా వి. ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘హంట్‌’. సీనియర్‌ హీ రో శ్రీకాంత్‌, ప్రేమిస్తే ఫేమ్‌ భరత్‌ ప్రధాన పాత్రధారులు. మహేష్‌ దర్శకత్వం వహించారు. సోమవారం హైదరాబాద్‌ లో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు.
హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ ” హంట్‌ సినిమా లో కొత్త పాయింట్‌ ఉంది. నిజాయతీగా చెప్పాలంటే ఏ హీరో అ-టె-ంప్ట్‌ కూడా చేయడు. అర్జున్‌ ఎ, అర్జున్‌ బి… సినిమాలో నా క్యారెక్టర్‌ రెండు షేడ్స్‌ లో ఉంటు-ంది. గతం మర్చిపోక ముందు పోలీస్‌ రోల్‌ చేయడానికి కొంత మంది ఇన్స్పిరేషన్‌ ఉన్నారు. గతం మర్చిపోయిన తర్వాత క్యారెక్టర్‌ కోసం ఎటు-వంటి స్ఫూర్తి లేదు. దానికి కొంచెం కష్టపడ్డాను. కామన్‌ మ్యాన్‌ పోలీస్‌ అయితే ఎలా ఉంటు-ందని ఊహించి చేశా. స్టంట్స్‌ విషయంలో రిస్క్‌ చేశానని అంటు-న్నారు”’ అని అన్నారు.
చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్‌ మాట్లాడుతూ ” ఇంగ్లీష్‌ -టైటిల్‌ తో వస్తున్న తెలుగు చిత్రమిది. జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా” అని అన్నారు.
సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ ”దర్శకుడు మహేష్‌ వచ్చి రెండు గంటలు కథ చెప్పినప్పుడు వెంటనే సినిమా చేస్తానని చెప్పాను.దర్శకుడు మహేష్‌ క్లారిటీ-తో తీశాడు. సినిమాలో నాది పాజిటివ్‌ క్యారెక్టరా? నెగిటివ్‌ క్యారెక్టరా? అనేది సస్పెన్స్‌. ” అని అన్నారు.
‘హంట్‌’ దర్శకుడు మహేష్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు చూసిన సుధీర్‌ బాబు కంటే బెస్ట్‌ సుధీర్‌ బాబును ఈ సినిమాలో చూస్తారు. పెర్ఫార్మన్స్‌, యాక్షన్‌ పరంగా ఆయన చాలా బాగా చేశారు. హీరో క్యారెక్టర్‌ విషయానికి వస్తే… గతం మర్చిపోయిన తర్వాత అతనో తెల్ల కాగితం లాంటివాడు. ఏం చేశాడు? అనేది ఇం-టె-స్టింగ్‌ ఎలిమెంట్‌. అని అన్నారు.
‘ప్రేమిస్తే’ ఫేమ్‌ భరత్‌, నటు-డు గోపరాజు రమణ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అన్నే రవి, నటి మౌనికా రెడ్డి పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement