Thursday, April 25, 2024

Whistle Podu – ధోనికి స్టాలిన్ నుంచి సుంద‌ర్ పిచాయ్ వ‌ర‌కూ అభినంద‌న‌ల హోరు..

ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్‌ను గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతోపాటు ఎంఎస్‌ ధోనీ నాయకత్వంపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను చివ‌రి బంతితో ఫోర్ కొట్టి మరీ ఐదో కప్‌ను సీఎస్‌కే సొంతం చేసుకుంది. దీంతో సోషల్‌ మీడియాలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా మాజీ ఆటగాళ్లు, క్రికెట్‌ అభిమానులు పోస్టులు పెట్టారు. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో స్టోరీస్‌ పోస్టు పెట్టాడు.

”సీఎస్‌కే జట్టుకు శుభాకాంక్షలు. ప్రతి పరిస్థితికి పక్కా ప్రణాళిక ఉండే ధోనీ నాయకత్వంలో ఐదోసారి కప్‌ను నెగ్గడం బాగుంది. చరిత్రాత్మక విజయంలో రవీంద్ర జడేజా తన అసాధారణ పోరాటంతో కీలక పాత్ర పోషించాడు”- ఎంకే స్టాలిన్ – తమిళనాడు ముఖ్యమంత్రి

”అద్భుతమైన ఫైనల్‌ మ్యాచ్‌. సీఎస్‌కేకు కంగ్రాట్స్‌. చివరి వరకు పోరాడిన గుజరాత్ టైటాన్స్‌ వచ్చే సీజన్‌లో మరింత బలంగా రావాలి”- సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవో

”కంగ్రాట్స్‌ సీఎస్‌కే.. ఒక టైటిల్ గెలవడమే కష్టం. అలాంటిది ఐదుసార్లు విజేతగా నిలవడం నమ్మశక్యంకానిది” – గౌతమ్‌ గంభీర్‌

”ఐపీఎల్‌ సీజన్‌కు అద్భుతమైన ముగింపు. రెండు జట్లూ (చెన్నై, గుజరాత్) విజయం కోసం అద్భుతంగా పోరాడాయి. చెన్నై లోతైన బ్యాటింగ్‌ ఆ జట్టును విజేతగా నిలిపింది. తొలి నుంచీ ఇరు జట్లూ సూపర్‌గా ఆడాయి. ఎంఎస్ ధోనీకి, సీఎస్‌కే జట్టుకు అభినందనలు”- సచిన్ టెండూల్కర్

- Advertisement -

”సూపర్ విక్టరీ. జడేజా (జడ్డూ) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రాయుడు, రహానె, దూబె నుంచి మంచి భాగస్వామ్యం. మోహిత్ నాణ్యమైన బౌలింగ్‌ వేసినప్పటికీ.. అసాధారణ పరిస్థితుల్లోనూ ఎలా నెగ్గాలనేది సీఎస్‌కేకు తెలుసు. మరోసారి విజిల్‌ పోడు”- వీరేంద్ర సెహ్వాగ్

”ఎంఎస్ ధోనీ అదృష్టజాతకుడు. వెల్‌డన్‌ సీఎస్‌కే. జడేజా బ్యాటింగ్‌ సూపర్బ్. రాయుడుకు అద్భుతమైన ముగింపు లభించింది”- ఇర్ఫాన్‌ పఠాన్

”ఎలాంటి చరిత్ర లేకుండా బతికేయాలని భావించేవారికి ఎంఎస్ ధోనీ జీవితం ఓ గుణపాఠం. ఐదోసారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా మారిన సీఎస్‌కే జట్టుకు అభినందనలు. అనుభవ లేమి బౌలింగ్‌తో ఎలా నెట్టుకొస్తారని ఫిర్యాదులు చేసిన వారికి సరైన సమాధానం ఇచ్చాడు. కంగ్రాట్స్ ఎంఎస్ ధోనీ”- హర్భజన్‌ సింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement