Tuesday, September 19, 2023

అనాథ పిల్ల‌లకోసం.. సోనూసూద్ సాయం

మ‌రోసారి త‌న ఉదార‌త‌ని చాటారు న‌టుడు సోనూసూద్.. అనాథ పిల్లల కోసం మరో పనికి శ్రీకారం చుట్టాడు ఈ రియల్‌ హీరో. సోనూసూద్‌ చేసిన మంచి పనులతో దేశ వ్యాప్తంగా కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్నారు. కాగా సోనూసూద్‌ అభిమానుల్లో పలువురు ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. బిహార్‌లోని కతిహార్‌కు చెందిన బీరేంద్ర కుమార్ మహ అనే ఇంజినీర్ సోనూసూద్ పేరు మీద ఒక స్కూల్‌ను నిర్మించారు. ఇందుకోసం తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. కేవలం అనాథ పిల్లల కోసమే ఈ పాఠశాలను నిర్మించారు. ఇప్పటికే ఈ స్కూల్ లో 100 మందిదాకా పిల్లలు ఉన్నారు. దాతలు ఇచ్చే వాటి మీదే ఈ స్కూల్ రన్ అవుతుంది. తాజాగా ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్.. ఇటీవల ఆ ఇంజినీర్‌ను కలిశారు. ఆయనతో చర్చించిన అనంతరం అక్కడ పిల్లలకు మరింత మెరుగైన విద్య, వసతి, ఆహరం అందించడానికి, మరింతమంది అనాథ పిల్లలను చేర్చుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందచేస్తానని, సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి కొత్త బిల్డింగ్ కట్టిస్తానని సోనూసూద్ తెలిపారు. ఈ మేరకు సోనూసూద్‌ అక్కడి పిల్లలతో మాట్లాడిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement