Monday, April 29, 2024

పుష్ప‌2 టీజ‌ర్.. బ‌న్నీ అద‌ర‌గొట్టాడుగా

పుష్ప‌2 టీజ‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టిన రోజు. ఈ టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటోంది. పుష్ప సీక్వెల్ పై ఇంట్రెస్ట్ ని పెంచారు మేక‌ర్స్. కాగా మైత్రీ సంస్థ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఇటీవలే రష్మిక బర్త్‌డే సందర్భంగా రిలీజైన పోస్టర్ తెగ ఆకట్టుకుంది. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ ప్రతినాయ‌కుడి పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్‌ దశలో ఉండగానే పుష్ప సీక్వెల్‌కు కోట్లలో బిజినెస్‌ జరుగుతుంది. కేవలం నాన్‌ థియేట్రికల్‌ హక్కుల కోసం పలు బడా సంస్థలు కోట్లలో ఆఫర్‌ చేస్తున్నాయట. టాలీవుడ్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం పలు ఓటీటీ సంస్థలు పుష్ప-2 డిజిటల్‌ హక్కుల కోసం అన్ని భాషలకు కలుపుకుని రూ.200 కోట్ల మేర ఆఫర్‌ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో గానీ, ఈ నంబర్‌ మాత్రం పుష్ప రేంజ్‌ ఏంటో అని స్పష్టం చేస్తుంది. వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్ అంటూ ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సినీ ప్రియులను ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement