Thursday, April 25, 2024

మీరు నా హీరో తాతయ్య.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సితార

మీరు నా హీరో తాతయ్య అంటూ ఎమోషనల్ అయింది సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు సితార. కాగా కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే తన కుమారుడు మహేష్ బాబు ఇంటిలో కృష్ణ ఉండేవారు కాదు. ఆయన కూతుళ్ళ దగ్గర లేదా నరేష్ వద్ద ఫార్మ్ హౌస్ లో ఉండేవారని సమాచారం. దీంతో ప్రతి వీకెండ్ పిల్లలతో పాటు మహేష్ తండ్రి కృష్ణ వద్దకు వెళ్లేవారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని లంచ్ చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. హైదరాబాద్ లో ఉంటే మహేష్ ఎన్ని పనులున్నా వీకెండ్ కృష్ణ వద్దకు వెళ్లేవారు. కృష్ణ మనవడు గౌతమ్, మనవరాలు సితారతో సరదాగా గడిపేవారు. వారిద్దరికీ తాతయ్యతో మంచి అనుబంధం ఉండేది.

ఇప్పుడు తాతయ్య లేరన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు. ఆయన్ని తలచుకొని, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార తాతయ్య మరణాన్ని ఉద్దేశిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. వీకెండ్ లంచ్ ఇకపై ఎప్పటికీ మునుపటిలా ఉండదు. మీరు ఎన్నో విలువైన విషయాలు నేర్పారు. నన్ను ఎంతగానో నవ్వించారు. ఇప్పుడవన్నీ మీ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. . మీరు గర్వపడేలా ఒకరోజు నేను చేస్తానని నమ్మకం ఉంది. మిమ్మల్ని నేను ఎంతగానో మిస్ అవుతున్నాను తాతగారు అని కామెంట్ చేశారు. సితార పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement