Saturday, April 20, 2024

Russia Ukraine War: విరుచుకుపడుతున్న రష్యా… ఉక్రెయిన్‌పై మిస్సైళ్ల దాడి..

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలకు భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. అయినప్పటికీ ఇదరు దేశాలు వెన్నక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌ చిన్నదేశమే అయినా రష్యాను ఎదురించి నిలుస్తోంది. ఇతర దేశాల అండదండలతో ఉక్రెయిన్‌ యుద్ధంలో రాణిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈరోజు రష్యా మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై విరుఉకుపడింది. ఈ క్రమంలో రష్యా మిస్సైళ్లు పక్కనే ఉన్న పోలండ్‌ లోకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలండ్‌ జాతీయులు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. పోలండ్‌ అధ్యక్షుడు, ప్రధాని అత్యవసర భేటీ అయ్యారు. దేశ భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సుదీర్గంగా చర్చించారు. దీంతో నేషనల్‌ సెక్యూరిటీ సమావేశానికి పిలుపు నిచ్చారు. కౌంటర్‌ యాక్షన్‌పై చర్చ నిర్వహించనున్నారు. నాటో ఆర్టికల్‌ 5 ప్రకారం భద్రత విషయంలో వెనక్కి తగ్గేది లేదని పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రెటరీ అన్నారు. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం కాస్త పక్క దేశాలకు వ్యాపిస్తే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement