Friday, April 26, 2024

గంజాయి రహిత సమాజం నిర్మిస్తాం.. సరఫరాదారుల పై ఉక్కుపాదం మోపండి : రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల జిల్లా : గంజాయి రజిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని సింగరేణి గార్డెన్స్ లో బెల్లంపల్లి పోలీసులు నిర్వహించిన గంజాయి నియంత్రణ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మత్తుపానీయాలకు యువత బానిసలుగా కావద్దన్నారు.

గంజాయి సాగు చేసిన సరఫరా చేసిన, విక్రయించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయి నియంత్రణలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు పోలీసులకు అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, ఏ సి పి ఎడ్ల మహేష్, సీఐలు జగదీష్, బాబురావు, రాజు తో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement