Monday, April 29, 2024

Bhupalpally | శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలి : ఎస్పీ కిరణ్ ప్రభాకర్

చిట్యాల, (ప్రభ న్యూస్) : సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు సహకరించాలని భూపాల్ పల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే కోరారు. ఇవ్వాల (మంగళవారం) సాయంత్రం జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ, చింతకుంటరామయ్య పల్లి గ్రామాలను ఎస్పీ సందర్శించారు.

అనంతరం పాఠశాల ఆవరణలోని పోలింగ్ బూతులను పరిశీలించారు. ఆ తరువాత‌ ఆయా గ్రామాల్లోవివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులతో ఎన్నికలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బందోబస్తు, ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల నియమాలి ఉల్లంఘిస్తే చట్టరీ చర్యలు తప్పవని హెచ్చరించారు.

మండలాల మధ్య చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, డబ్బులు, బంగారం తీసుకెళ్లేవారు సరియైన ఆధారాలతో వెళ్లాలని సూచించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల నిర్వహణను నిషేధించడం జరిగిందని. అపరిచిత వ్యక్తులు, ఆకతాయిలు తారాస పడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూరు శాతం ఓటింగ్ జరిగేలా ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు, అధికారులు సహకరించాలని ఎస్పీ కోరారు. ఆయన వెంట డీఎస్పీ రాములు, చిట్యాలసీఐ వేణు చందర్, సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పోలీస్ సిబ్బంది , వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement