Sunday, May 5, 2024

3వేల కోట్ల నష్టం వస్తున్నా ధాన్యం కొంటున్నాం.. చేతగాని దద్దమ్మలా కెసిఆర్ ని విమ‌ర్శించేది: ఎర్రబెల్లి

జనగామ, (ప్రభన్యూస్ ప్రతినిధి) : సీఎం కెసిఆర్ రైతుల పక్షపాతి.. రైతుల కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా రూ.3 వేల కోట్ల నష్టం వస్తున్నా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్ట మొదటి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో రైతు బంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఎర్ర‌బెల్లి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు ముందుగా కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. వడ్ల రాశి పై గులాబీ రంగులో జై కెసీఆర్ అని రాయడం అందరినీ ఆకట్టుకున్నది.

మన ఇండ్లకు, పొలాలకు గోదావరి నీరును తెచ్చిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు. కాంగ్రెస్, బీజేపీ నీళ్ళ కోసం అలమటిస్తున్న ప్రజలని ఏనాడూ పట్టించుకోలేదని, కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా.. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? అని ఈ సందర్బంగా ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement