Thursday, April 25, 2024

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ ట్ర‌య‌ల్ స‌క్సెస్‌.. భార‌త్‌లో ఫ‌స్ట్‌ హెవీ డ్యూటీ టిప్పర్ ఇదే..

ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్‌ను శుక్ర‌వారం విజయవంతంగా ప్రారంభించింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అగ్రగామి, మార్కెట్ లీడర్‌గా ఉన్న ఒలెక్ట్రా ట్రక్కుల తయారీకి శ్రీ‌కారం చుట్టింది. అందులో భాగంగా రూపొందించిందే ఈ అంతర్నిర్మిత హెవీ-డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది, సింగిల్ ఛార్జితో 220 కి.మీ. ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ఈ టిప్పర్ 25 శాతం డ్యూటీ బోగీ సస్పెన్షన్ గ్రేడబిలిటీ (ఎత్తైన రోడ్లూ, ఘాట్ రోడ్లు) కూడా కలిగి ఉంటుంది.

త్వరలో హైదరాబాద్ శివార్లలో అత్యాధునిక సదుపాయాల‌తో కూడిన ఉత్ప‌త్తి యూనిట్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ చైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ మాట్లాడుతూ, “భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్రగామిగా ఉన్న, ఒలెక్ట్రా ఇప్పుడు హెవీ డ్యూటీ టిప్పర్ ట్రయల్స్‌ను ప్రారంభించింద‌న్నారు. దేశంలో ఈ రకమైన ట్రక్ ఇదే మొదటిది కావ‌డం గర్వకారణం. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు విపరీతంగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ ట్రక్కులు ఈ రంగంలో గేమ్-ఛేంజర్‌గా మారతాయ‌ని అయ‌న అన్నారు. ఈ టిప్పర్ పనితీరు అద్భుతంగా, స‌మ‌ర్థ‌వంతంగా ఉంటుందని, ఒలెక్ట్రా దీన్ని సాధ్యం చేసిందన్నారు. ఇంతకు ముందు వాగ్దానం చేసినట్లు, తాము కలను సాకారం చేస్తున్నాం” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement