Thursday, April 25, 2024

విజయవాడ, సాగర్‌లలో వాటర్ ఏరో డ్రోమ్‌లు

ఏపీ, తెలంగాణలలో నీటిపై తేలియాడే ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిపై వాటర్ ఏరో డ్రోమ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేయగా.. దేశ వ్యాప్తంగా తొలి దశలో 14 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన, తెలంగాణలోని నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఒక్కొక్క వాటర్ ఏరోడ్రోమో‌లను అభివృద్ధి చేయనున్నారు.

సముద్ర ఆధారిత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా తొలి దశలో దేశవ్యాప్తంగా 14 చోట్ల వాటర్‌ ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి కేంద్ర నౌకాయాన శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఏపీ మారిటైమ్‌ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన, తెలంగాణ పరిధిలో నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఒక్కొక్క వాటర్‌ ఏరోడ్రోమ్‌లను అభివృద్ధి చేయనున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.450 కోట్లతో వాటర్‌ ఏరోడ్రోమ్‌లను అభివృద్ధి చేయనున్నారు. సీ ప్లేన్స్‌ ద్వారా మారుమూల ప్రాంతాలను సైతం ప్రధాన నగరాలతో అనుసంధానం చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా వీటిని అభివృద్ధి చేస్తారు.

ఈ వార్త కూడా చదవండి: జూరాలకు భారీగా వరద… 12 గేట్లు ఎత్తివేత

Advertisement

తాజా వార్తలు

Advertisement