Saturday, April 20, 2024

జూరాలకు భారీగా వరద..12 గేట్లు ఎత్తివేత..

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాలకు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుడటంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసారు. ప్రస్తుతం జూరాలకు 83,000 క్యూసెక్కులు ఇన్ ఫ్లోగా వస్తుండగా 86,673 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుకాగా… ప్రస్తుత నీటిమట్టం 318.420 మీటర్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.459 టీఎంసీలుగా ఉంది. ఇక ప్రాజెక్టులోని అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

ఇది కూడా చదవండి: 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్ చదివే అవకాశం.. తెలుగులోను..

Advertisement

తాజా వార్తలు

Advertisement