Friday, February 23, 2024

వాల్తేరు వీరయ్య చిత్రం నుండి బాస్ పార్టీ సాంగ్ ప్రోమో.. అదరగొట్టిన చిరంజీవి

వాల్తేరు వీరయ్య చిత్రం నుండి బాస్ పార్టీ సాంగ్ ప్రోమోని షేర్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. ఊరమాస్‌గా ఈ పార్టీ సాంగ్ సాగనున్నట్టు ప్రోమోతో అర్ఠమవుతుంది. బాస్‌ పార్టీ ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు.ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ టీజర్‌ నెట్టింట్లో హల్‌ చల్ చేస్తోంది.మెగాస్టార్ చిరంజీవి మాస్‌ అవతారంలో అందరినీ ఎంటర్‌టైన్‌ చేయనున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు డైరెక్టర్‌. మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందిస్తున్నట్టు తాజా ప్రోమోతో అర్థమవుతుంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది.వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
వాల్తేరు వీరయ్య చిత్రంలో ర‌వితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ మూవీలో శృతిహాస‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఈ చిత్రానికి బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement