Monday, December 4, 2023

160 ప‌రుగుల‌కు న్యూజిలాండ్ ఆలౌట్… భార‌త్ టార్గెట్ 161 ప‌రుగులు

న్యూజిలాండ్‌ vs ఇండియా మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడ‌వ టీ20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 19.4 ఓవ‌ర్ల‌లో 160 ప‌రుగులకు ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు కాన్వే 59 ప‌రుగులు, గ్లెన్ ఫిలిప్స్ 54 ప‌రుగులు చేశారు. మిగ‌తా బ్యాట్స్ మెన్లు ఎవ‌రూ భారీ స్కోర్ చేయ‌లేక‌పోయారు. భారత్ బౌలర్లు హర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లు, మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement