Wednesday, May 22, 2024

లైగ‌ర్ నుండి అప్ డేట్-వాట్ ల‌గా దేంగే వీడియో

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తోన్న మూవీ లైగ‌ర్.ఈ చిత్రంలో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌..హీరోయిన్ గా అన‌న్యాపాండే న‌టిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని క‌ర‌ణ్‌జొహా‌ర్‌, చార్మీతో క‌లిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆగస్టు 25న విడుదల కానుంది. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో రూపొందించారు.

ఇటీవ‌లే విడుదలైన ట్రైల‌ర్, పాట యూట్యూబ్‌లో మిలియ‌న్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు చిత్ర బృందం లైగ‌ర్ యాటిట్యూడ్ సాంగ్ పేరిట అధికారిక మ్యూజిక్ వీడియోను విడుద‌ల చేశారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన ఈ పాట‌ను విజ‌య్ స్వయంగా ఆల‌పించాడు. పూరి సాహిత్యం అందించాడు. లైగర్ చిత్రంలో విజయ్ యాటిట్యూడ్ ఎలా ఉండబోతోందో ఈ పాట ద్వారా అర్థం అవుతోంది. ‘వాట్ లగా దేంగే’ అంటూ ఒక నిమిషం 26 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట విడుదలైన క్షణాల్లోనే యూట్యూబ్లో దూసుకెళ్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement