Tuesday, May 14, 2024

Three days Celebrations – ఘ‌నంగా ప్రారంభ‌మైన విజ‌య‌న‌గ‌ర ఉత్స‌వాలు… అల‌రిస్తున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

విజయనగరం, అక్టోబరు 29(ప్రభ న్యూస్): విజయనగర ఉత్సవాల్లో భాగంగా ఆనందగజపతి ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. మహారాజా సంగీత కళాశాల అద్వర్యం లో శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, జానపద సంగీత కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల పాటు సుమారు 40 బృందా లు ప్రదర్శన ఇవ్వనున్నాయి. ఈ ప్రదర్శనలను మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి , జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఎస్.పి దీపిక తదితరులు వీక్షించారు. అనంతరం కళాకారులను సన్మానించి మెమెంటో లను అందజేశారు.

ఆకట్టుకుంటున్న పుష్ప, ఫల ప్రదర్శనలు::

మహారాజ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన పుష్ప ఫల ప్రదర్శన ను మంత్రివర్యులు ప్రారంభించారు. ఈ ప్రదర్శన విజ్ఞానందంకంగా, నాయనానందకరంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రదర్శన లో ఫ్రెష్ ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్, వెజిటబుల్ కార్వింగ్, సైకథ శిల్పం, నర్సరీ తదితర మొక్కలను ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ పలువురుకు ఆకర్షిస్తోంది. పూలు, మొక్కలతో తయారు చేసిన భారత దేశం మాప్ , పూల పుట్టగొడుగులు, కాఫీ మగ్ విత్ కప్, పూలతో చేసిన పలు రకాల పక్షులు, జంతువులు బార్బీ డాల్ , వాటర్ ఫౌంటెన్, పెద్దల్లో పిల్లల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.

అంత‌కుముందు న‌గ‌ర వీధుల‌లో శోభ‌యాత్ర‌ను నిర్వ‌హించారు.. పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి గురజాడ కళాభారతి వరకు జరిగిన శోభాయాత్రలో పుర ప్ర‌ముఖుల‌తో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement