Thursday, May 2, 2024

వివేకానందుడి చికాగో ప్రసంగం చిరస్మరణీయం: మోడీ

1893లో అమెరికాలోని చికాగోలో స్వామి వివేకానంద చేసిన ఉత్కృష్ట ప్రసంగాన్ని ప్రధాని మోడీ స్మరించుకున్నారు. ఆనాటి ప్రసంగం తో భారతీయ విలువల్ని, సంస్కృతిని ప్రపంచం ముందు వివేకానంద ఆవిష్కరించారని కొనియాడారు. సెప్టెంబర్‌ 11వ తేదీకి స్వామికి వివేకానందతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్‌చేశారు. 1893లో ఇదే రోజున అతను చికాగోలో తన అత్యుత్తమ ప్రసంగాన్ని వినిపించాడు.

ప్రపంచానికి భారతదేశ సంస్కృతి, ప్రాచీన విలువలు, నైతికతలను పరిచయం చేశారని గుర్తుచేశారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని కూడా ప్రధాని తన ట్వీట్‌లో పంచుకున్నారు. తన ప్రసంగంలో ప్రతి మతానికి మార్గనిర్దేశనం చేసే సత్యాన్ని వివరించారు. భారతదేశ తాత్విక అంగీకారాన్ని కూడా నొక్కిచెప్పారు అని ప్రధాని గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement