Thursday, April 25, 2024

కోహ్లీ బ‌యోపిలో న‌టిస్తా.. రామ్ చ‌ర‌ణ్‌

స్పోర్ట్స్ స‌బ్జెక్ట్ ఉన్న ఫిల్మ్ లో న‌టిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. విరాట్ కోహ్లీ బ‌యోపిక్ లో న‌టిస్తారా అని అడగ్గా.. న‌టిస్తాన‌ని రాంచ‌ర‌ణ్ అన్నాడు. కోహ్లీ అద్భుత‌మైన వ్య‌క్తి అని, చాలా ప్రేర‌ణాత్మ‌క క్రికెట‌ర్ అని, ఒక‌వేళ ఛాన్స్ ఇస్తే, క‌చ్చితంగా ఆ ఫిల్మ్‌లో న‌టిస్తాన‌ని చెర్రీ చెప్పాడు. త‌న ఫేస్ క‌ట్ కూడా కోహ్లీ త‌ర‌హాలోనే ఉంటుంద‌న్న ఓ సిగ్న‌ల్ కూడా రాంచ‌ర‌ణ్ ఇచ్చాడు.రాంచ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఆ అవార్డును లాస్ ఏంజిల్స్‌లో జ‌రిగిన వేడుక‌లో అందుకున్న చెర్రీ.. అక్క‌డ నుంచి నేరుగా ఢిల్లీలో జ‌రుగుతున్న ఇండియా టుడే కాన్‌క్లేవ్ కు హాజ‌ర‌య్యాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రాంచ‌ర‌ణ్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఇక ఇండియా ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన తొలి వ‌న్డే స‌మ‌యంలో.. కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ.. నాటు నాటు పాట‌పై స్టెప్పులేశాడు. కోహ్లీ డ్యాన్స్ మూవ్స్‌ను టీవీ కెమెరాలు బంధించాయి. ఆ స్టెప్స్ కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement