Thursday, April 25, 2024

ధర్మం – మర్మం :


గంగాజలము మర ్త్యలోకము చేరు విధానమును బ్రహ్మదేవుడు నారదునికి తెలిపిన వృత్తాంతము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

బలిచక్రవర్తి దురాక్రమణను సహించలేని దేవతలు శ్రీమహావిష్ణువుని శరణు వేడుతూ బలి తమ రాజ్యమును ఆక్రమించి తమను దిక్కులకు పారద్రోలెనని, తమ దిక్పాలకతత్త్వాన్ని, తమకు అర్పించే హవిస్సును, తానే తీసుకోవడం వలన తాము ఆర్తి పొందుతున్నామంటూ వాపోయిరి. నీవే నాధుడిగా భావించి నీ పాదాలకు నమస్కరించే మేము బలి పాదాలకు ఎలా నమస్కరించాలని ప్రశ్నించిరి. మహా యజ్ఞములతో నిన్నే ఆరాధిస్తూ, వాక్కులతో స్తుతిస్తూ, శరీరముతో సేవిస్తున్న మేము, నీ బలమునే ఆశ్రయించి నీవిచ్చిన త్రైలోక్య రాజ్యాన్ని పొందిన మేము దైత్యుడిని ఎలా నమస్కరించాలని చింతించిరి. బ్రహ్మరూపంతో సృష్టి చేస్తూ, విష్ణు రూపంతో రక్షిస్తూ, రుద్ర రూపంతో సంహరిస్తూ తమకు ఐశ్వర్యం ప్రసాదించినవాడవు నీవంటూ, తమ ఐశ్వర్యాన్ని హరించిన బలికి ఏవిధంగా నమస్కరించాలని ప్రశ్నించిరి. అనంతుడైన నీవు ప్రసాదించిన ఐశ్వర్యము, బలముతో సకల లోకాలను గెలిచిన మేము అంతముకాగల బలికి ఎలా నమస్కరించాలని అడిగిన దేవతలకు శ్రీహరి బలిచక్రవర్తి కూడా తన భక్తుడేనంటూ బదులిచ్చెను. బలిని కూడా తానే పోషిస్తున్నానని కానీ బలి దురాక్రమములను తొలగించి మీ రాజ్యమును తిరిగి మీకు ప్రసాదించెదనని పలికెను. యుద్ధముతో పని లేకుండా త్రైలోక్య రాజ్యాన్ని హరించి మంత్రములతో బలిని బంధించెదనని దేవతలకు శ్రీహరి అభయమిచ్చెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement