Saturday, May 4, 2024

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో

ఒక్క ఫోటో కొన్నిసార్లు ఆలోచింపచేస్తుంది. ప్రస్తుతం ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణలో విద్యాసంస్థలను ప్రభుత్వం బంద్ చేసింది. కానీ వైన్ షాపులు మాత్రం తెరిచే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు తమను రోడ్డుప పడవేయద్దని ఆందోళన బాట పట్టారు.

ఈ ఆందోళనలో భాగంగా ఓ ఉపాధ్యాయురాలు ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపింది. సదరు ప్లకార్డులో ‘బార్‌లో లేని కరోనా బడిలో ఉందా?’ అని రాసి ఉంది. దీంతో ఈ ప్లకార్డు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. రాష్ట్రంలో బార్లు సహా మిగతావేం మూసేయకుండా స్కూళ్లకే ఎందుకు తాళాలు వేశారని కొందరు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరికొందరు బార్‌లకు వెళ్లడం స్వీయ విచక్షణ అని.. కాదని వెళ్తే వాళ్ల కర్మ అని వాదిస్తున్నారు. కానీ బడికి వెళ్లే పిల్లల బంగారు భవిష్యత్‌ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలుకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement