Saturday, May 4, 2024

ఎపీ ఇంటర్ సర్కిల్ పోటీల్లో ఛాంపియన్ గా విజయవాడ ట్రాన్స్ కో..

తిరుపతి, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తిరుపతిలో మూడు రోజులపాటు జరిగిన ఆంధప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ ఇంటర్ సర్కిల్ ఉమెన్ గేమ్స్ & కల్చరల్ కాంపిటీషన్స్ టోర్నమెంట్ 2022-23లో ఓవరాల్ ఛాంపియన్ గా ఏపీ ట్రాన్స్ కో, విజయవాడ జట్టు నిలిచింది..తిరుపతిలో ఈనెల 14వతేదీ నుంచి 16వతేదీ వరకు మూడు రోజులపాటు జరిగిన ఆంధప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ ఇంటర్ సర్కిల్ ఉమెన్ గేమ్స్ & కల్చరల్ కాంపిటీషన్స్ టోర్నమెంట్ 2022-23 గురువారం ముగిసింది. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఎపిఎస్ పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో సాయంత్రం జరిగింది.

ఈ పోటీలలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ టి. భారతి (విద్యుత్ సౌదా, విజయవాడ), ఓవరాల్ చైర్మన్ ట్రోఫీవి ఏపీ ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ జట్టు దక్కించుకున్నారు. అలాగే ఈ టోర్నమెంట్ లో భాగంగా బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, టేబుల్ టెన్నిస్, షటిల్, చెస్, క్యారమ్స్, లాంగ్ జంప్, టగ్ ఆఫ్ వార్, పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ఉద్యోగులు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందుకున్నారు. ఇక సాంస్కృతిక పోటీల్లో బెస్ట్ ప్లేలెట్ బృందంగా ఏపీ జెన్కో, లోయర్ సీలేరు జట్టు నిలిచింది. విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎ పీ ఎస్ పీ డీ సి ఎల్ డైరెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీడీసీఎల్ జాయింట్ సెక్రటరీ ఎ. రాధాజయశ్రీ, జనరల్ మేనేజర్లు విఆర్కే రాజు, పద్మ, శోభా వాలెంటీనా, తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎం. కృష్ణా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కె. వాసుదేవ రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ కుమార వడివేలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాసురెడ్డి, సురేష్, రెడ్డెప్ప, సుబ్బారావు, స్పోర్ట్స్, గేమ్స్ కార్యదర్శి పురుషోత్తం, సాంస్కృతిక కార్యదర్శి ఎం. జయచంద్ర, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement