Wednesday, May 1, 2024

ఆ ప్రమాదం నుండి విజయ్ కాంత్ కాపాడారు .. విజ‌య‌శాంతి

తాను సినిమాల్లో న‌టించే రోజుల‌ని గుర్తు చేసుకున్నారు న‌టి.. బిజెపి మ‌హిళా నేత విజ‌య‌శాంతి. కాగా లేడీబాస్’ సినిమాలో తాను చేసిన ఫీట్ కి ఫైట్ మాస్టర్ సైతం భయపడిపోయాడ‌ని చెప్పారు. ఒక సినిమా షూటింగులో ప్రవాహంలో కొట్టుకుపోయిన నేను, మరో సినిమా షూటింగులో మంటల్లో చిక్కుకున్నాను. అది ఒక తమిళ సినిమా .. అందులో విజయ్ కాంత్ హీరో. ఫారెస్టు నేపథ్యంలోని ఒక గుడిసెలో నన్ను కట్టేసి .. గుడిసెను తగులబెట్టాలి. గుడిసెను అంటించే సమయానికి ఒక్కసారిగా పెద్దగాలి వచ్చింది .. దాంతో ఒక్కసారిగా గుడిసె అంతా అంటుకుందని చెప్పారు. గుడిసెలో లోపల నన్ను కట్టేసి ఉంచారు. ఒక వైపున సిల్క్ చీర .. మరో వైపున నా జుట్టు కాలిపోతున్నాయి. ఏం చేయాలో తోచకపోవడంతో కాపాడటానికి ఎవరూ రావడం లేదు. అప్పుడు ఒక్కసారిగా విజయ్ కాంత్ గారు వచ్చారు. ఆయన ఏం చేశాడో తెలియదుగానీ నన్ను ఆ ప్రమాదంలో నుంచి బయటపడేశార‌ని తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement