Friday, May 3, 2024

వాల్తేరు వీర‌య్య‌లో చిరంజీవికి విల‌న్ గా – విజ‌య్ సేతుప‌తి

మెగాస్టార్ చిరంజీవికి విల‌న్ గా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం చిరంజీవి రెండు సినిమా షూటింగ్‌ల‌ను ఏక‌కాలంలో జ‌రుపుతున్నాడు. అందులో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఒక‌టి. ఈ చిత్రానికి వాల్తేరు వీర‌య్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు బాబీ అధికారికంగా ప్ర‌క‌టించాడు. కాగా ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం ప్ర‌ముఖ స్టార్ హీరో ఎంపికైన‌ట్లు స‌మాచారం. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో విల‌న్‌గా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో స‌మాచారం. ఇది వ‌ర‌కే మేక‌ర్స్ విజ‌య్ సేతుప‌తిని సంప్ర‌దించగా, పాత్ర న‌చ్చ‌డంతో త‌న కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్‌. ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి పాత్ర ఇంట‌ర్వెల్‌లో రివీల్ కానుంద‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుంది. ‘ఉప్పెన‌’ సినిమాలో విజ‌య్‌ పండించిన విల‌నిజంకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇక చిరు సినిమాలో విల‌న్ అంటే ఎలా న‌టిస్తాడో అని ప్రేక్ష‌కుల‌లో తీవ్ర ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రంలో చిరు అండ‌ర్‌క‌వ‌ర్ కాప్‌గా క‌నిపించ‌నున్నాడు. విశాఖ‌ప‌ట్నం నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మాస్‌రాజ ర‌వితేజ కీల‌క‌పాత్రలో న‌టిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మెగాస్టార్‌కు 154వ సినిమాగా తెర‌కెక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement