Friday, May 3, 2024

విజ‌య్ 66వ చిత్రం నుండి ఫొటోలు లీక్ – అసంతృప్తి వ్య‌క్తం చేసిన ద‌ర్శ‌కుడు

ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లు చిత్రాల‌నుండి ఫొటోలు..సీన్ కి సంబంధించిన వీడియోలు లీక్ అవ్వ‌డం కామ‌న్ గా మారింది. కాగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ 66వ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. ఈ షూట్ నుండి ప‌లు ఫొటోలు లీక్ అయ్యాయి.. విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న సినిమా షూటింగ్ ఫొటోలు లీకయ్యాయి. ఇవి సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇవ్వ‌డంతో దర్శకుడు వంశీ అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. ఇకపై షూటింగ్ సమయంలో ఎవరికీ ఫోన్ అనుమతించకూడదన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. రోడ్డు పక్కన నర్సరీలో వేసిన షూటింగ్ సెట్ లో విజయ్ క్యాజువల్ డ్రెస్ వేర్ లో కనిపించగా.. రష్మిక పొట్టి టాప్ తో వెనుకనే నించున్నట్టు కనిపిస్తోంది. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఆసక్తిగా చూస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వంశీ రూపొందిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement