Saturday, April 20, 2024

వెంకటేష్ ‘నారప్ప’ మూవీ ట్రైలర్

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘నారప్ప’ ట్రైలర్ బుధవారం విడుదలైంది. కుల వ్యవస్థ, భూవివాదం వంటి సామాజిక అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో భూమి కోసం పోరాటం చేసే వ్యక్తిగా వెంకటేష్ నటన ప్రతిఒక్కరితో చప్పట్లు కొట్టించేలా ఉంది. ఆయన చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. తమిళ మూవీ ‘అసురన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి నటించింది. ప్రకాష్ రాజ్, మురళీశర్మ, కార్తిక్‌ రత్నం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈనెల 20న ఈ సినిమా విడుదల కానుంది. వెంకటేష్ నటించిన ఓ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావడం ఇదే తొలిసారి. కాగా ‘బ్రహ్మోత్సవం’ వంటి డిజాస్టర్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల నుంచి వస్తున్న తొలి సినిమా ఇదే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement