Monday, April 29, 2024

నానే వ‌రువెన్ చిత్రం నుండి లిరిక‌ల్ వీడియో రిలీజ్

త‌మిళ హీరో ధ‌నుష్ న‌టిస్తోన్న తాజా చిత్రం నానే వరువెన్ ..సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ”నేనే వస్తున్నా” అనే పేరుతో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 29వ తేదీన తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో నేనే వస్తున్నా’ చిత్రాన్ని టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నేనే వస్తున్నా’ సినిమా నుంచి ‘వీరా సూర’ అనే సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ లాంచ్ చేశారు. మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేసిన ఈ సాంగ్ విజువల్ గానూ బాగుంది. లిటిల్ మ్యాస్ట్రో యువన్ శంకర్ రాజా దీనికి ట్యూన్ కంపోజ్ చేయగా.. గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. యువ గాయకుడు రాహుల్ నంబియార్ తనదైన శైలిలో ఆలపించారు.ఈ చిత్రంలో ధనుష్ డ్యూయల్ రోల్ లో నటించారు. ధనుష్ సరసన ఇందూజ రవిచంద్రన్ మరియు గ్రీకు నటి షెల్లీ అవ్రమ్ హీరోయిన్లుగా నటించారు. సెల్వరాఘవన్ కీలక పాత్రలో నటించగా.. యోగి బాబు – ప్రభు ఇతర పాత్రలు పోషించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement