Monday, April 29, 2024

రాష్ట్రాలకు వ్యాక్సిన్‌లు ఇచ్చేందుకు ఒప్పుకోని టీకా కంపెనీలు

కరోనా వ్యాక్సిన్‌ల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హడావిడిగా కరోనా టీకా ఉత్సవ్ పేరుతో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‎ను ప్రారంభించిన మోదీ ప్రభుత్వం.. డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో మాత్రం విఫలమైంది. కేంద్రం వ్యాక్సిన్ల పంపిణీలో ఆదిపత్యం వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కరోనా వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్‎కు రాష్ట్రాలకు అనుమతినిచ్చింది.

దీంతో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు విదేశాలకు చెందిన పలు ఫార్మా కంపెనీలకు వ్యాక్సిన్ కోసం అభ్యర్థించాయి. అయితే దీనిపై ఆయా ఫార్మా కంపెనీలు స్పందిస్తూ.. తాము కేవలం భారత ప్రభుత్వానికి మాత్రమే టీకా పంపిణీ చేస్తామని, రాష్ట్రాలకు పంపిణీ చేయమని తేల్చి చెప్పాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైజర్, మోడర్నా కంపెనీలను సంప్రదిస్తే ఇదే సమాధానం వచ్చింది. అటు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరెందర్ మోడెర్నా కంపెనీని సంప్రదిస్తే.. ఆ కంపెనీ కూడా అదే సమాధానం చెప్పింది. దీంతో మోదీ సర్కార్ వ్యాక్సిన్ పంపిణీపై గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని, రాష్ట్రాలకు వ్యాక్సిన్లు పంపిణీ కావట్లేదని తెలిసినా చోద్యం చూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement