Friday, April 26, 2024

అమెరికాలో ఇక మాస్క్ లేకుండానే తిరగొచ్చట..కండీషన్స్ అప్లై

అమెరికా ప్రజలకు ఊరట ఇకపై అక్కడ మాస్కులు ధరించకుండానే బయట తిరుగొచ్చట..అయితే ఓ కండీషన్ పెట్టింది సీడీసీ…వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు మాత్రమే మాస్కులు లేకుండా బయటకు రావచ్చట. తాజాగా ఇకపై అమెరికా పౌరులు మాస్కులు ధరించకుండానే బయటకు రావొచ్చు. అయితే, వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని…సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిన్న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యాక్సినేషన్ పూర్తయినవారితోపాటు ఒక డోసు వేసుకున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఇకపై వారు మాస్కు ధరించకుండానే బహిరంగ ప్రదేశాల్లో తిరగొచ్చు. ఒంటరిగా కానీ, కుటుంబ సభ్యులతో కానీ కలిసి నడకకు, షికారుకు వెళ్లొచ్చు. అయితే, జనాల గుంపులోకి వెళ్లటప్పుడు మాత్రం మాస్కు ధరించడమే మేలని సీడీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, మాస్క్ ధరించని వారు మాత్రం బయటకు వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం  చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement