Sunday, May 12, 2024

గుర్తు తెలియని మృతదేహం లభ్యం.. శామీర్ పేట లో ఘటన

శామీర్ పేట, (ప్రభ న్యూస్): ఓ గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం శామీర్ పేట పోలీసులకు లభ్యం అయింది. ఈ రోజు (శనివారం) ఉదయం 08:40 గంటల ప్రాంతంలో అంతాయి పల్లి గ్రామ చెరువు దగ్గరలో ఒక గుర్తు తెలియని మగ శవం కుళ్లిన స్థితి లో ఉందని ఒక వ్యక్తి 100 కాల్ చేసి చెప్పగా, శామీర్ పేట్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు.

అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం కుళ్లిన స్థితి లో గుర్తు పట్టరాని విధంగా ఉండి, అట్టి వ్యక్తి వయస్సు దాదాపుగా 40-45 సంవత్సరాలు, ఎత్తు అందాజ 5.0 ఫీట్ లు గా ఉండి, పైన ఒక పసుపు రంగు గల బట్ట ఉన్నదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు శామీర్ పేట్ పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement