Friday, May 3, 2024

U-19 Asia Cup | నేపాల్‌పై భారత్ భారీ విజయం..

దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న U19 ఆసియా కప్‌లో భాగంగా.. ఇవ్వాల (మంగళవారం) జ‌రిగిన మ్యాచ్‌లో భారత్ ఘన వజయం సాధించింది. నేపాల్‌తో జరిగిన 257 బంతులు మిగిలి ఉండగానే ఆటను ముగించి… 10 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకంది టీమిండియా.

53 పరుగుల స్వల్ప టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన భారత బ్యాటర్లలో.. అర్షిన్ కులకర్ణి (43), ఆదర్శ్ సింగ్ (13) పరుగులు చేసి కేవలం 7.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశారు. ఇక, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్… బౌలింగ్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచింది. భారత మీడియ్ పేస్ బౌలర్ రాజ్ లింబాని నిప్పులు చెరిగే బంతులు సంధించి 7 వికెట్లు కుప్ప కూల్చాడు. దీంతో నేపాల్‌ను 52 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక, ఆరాధ్య శుక్లా 2, అర్షిన్ కులకర్ణి 1 వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement