Monday, April 12, 2021

పోలీస్ బాస్ కొడుకునంటూ…. రోడ్డు పై రెచ్చిపోయిన యువకుడు

కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబులు హల్ చల్ చేశారు. నడిరోడ్డుపై హంగామా సృష్టించారు. మెయిన్ రోడ్డు పక్కనే సోడాలు అమ్ముకొని జీవనం సాగించే చిరు వ్యాపారిపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి ఇన్నోవా వాహనం లో ఇద్దరు వ్యక్తులు మియాపూర్ నుంచి కూకట్ పల్లి వైపు ప్రయాణిస్తున్న. కాగా కే పి హెచ్ బి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన సోడాలుఅమ్ముకుంటున్న వ్యాపారిని మందులోకి మంచినీళ్లు కావాలని అడిగారు. ఇవ్వడటం కుదరదని ఆ వ్యాపారి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరాడు.

కానీ వాళ్ళు మాత్రం నీళ్లు ఇవ్వాల్సిందే అంటూ రాద్ధాంతం చేశారు. నీరు ఇచ్చేందుకు వ్యాపారి ససేమిరా అనడంతో పక్కనే ఉన్న మంచినీటి డబ్బా ను కింద పడేశారు. నేను ఎవరో తెలుసా పోలీస్ ఆఫీసర్ కొడుకుని అంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా కారు కి ఉన్న పోలీస్ సైరన్ కూడా మోగించి భయపెట్టేందుకు ప్రయత్నం చేశాడు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు కూడా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇద్దరు యువకులలో శ్రీనివాస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో యువకుడు అరుణ్ కుమార్ తండ్రి ఏఆర్ విభాగంలో అదనపు ఎస్పీగా పని చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News