Sunday, April 28, 2024

సూర్యాపేట జిల్లాలో విషాదం.. సెల్ఫీ వీడియో తీసుకుని ప్రేమికుడి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ మండలం బూరుగడ్డలో విషాదం చోటుచేసుకుంది. ప్రియురాలు లేని జీవితం త‌న‌కు వ‌ద్దంటూ ఓ యువకుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం మౌనిక అనే అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఈ విష‌యం తెలుసుకున్న ప్రియుడు ప‌వ‌న్ మ‌న‌స్తాపానికి గురై సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి మృతి చెందాడు. పవన్ తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మౌనిక‌, ప‌వ‌న్ పెళ్లికి మొద‌ట వారి త‌ల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అయితే, ఇటీవ‌ల మ‌ళ్లీ గొడ‌వ‌లు రావ‌డంతో మౌనిక ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణ విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement