Friday, May 3, 2024

బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు రెండు ఎంట్రెన్స్‌లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం టీఎస్‌ ఎంసెట్‌తో పాటు నీట్‌ యూజీ రెండు ఎంట్రెన్స్‌లు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లోని సీట్లను, ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లను ఎంసెట్‌ ర్యాంక్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేయనున్నారు. ఈమేరకు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ సోమవారం ప్రకటించింది. ప్రైవేట్‌ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్లను మాత్రం నీట్‌ ర్యాంక్‌ ఆధారంగా భర్తీ చేస్తామని వెల్లడించింది.

ఇందుకు అనుగుణంగా అభ్యర్థులు రెండూ ఎంట్రెన్స్‌లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కన్వీనర్‌ కోటా సీట్లను కూడా ఈసారి నీట్‌ ర్యాంక్‌ ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉంది. అయితే రెండ్రోజుల క్రితం ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌(ఐఎన్‌సీ) ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. నీట్‌కు బదులు రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ను నిర్వహించుకోవాలని సూచించింది. ఈక్రమంలోనే ఐఎన్‌సీ ఆదేశాలకు అనుగుణంగా కాళోజీ హెల్త్‌ వర్సిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement