Friday, May 17, 2024

దేశవాళి క్రికెట్‌ కేలండర్‌ విడుదల.. జూన్‌ 28నుంచి ప్రారంభం

2023-24 దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ జూన్‌ 28నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది దులీప్‌ ట్రోఫీ టోర్నమెంట్‌తో సీజన్‌ మొదలవుతుందని, రంజీ ట్రోఫీ వచ్చే ఏడాది జనవరి 5 నుండి ప్రారంభమవుతుందని బీసీసీఐ ప్రకటించింది. ఆరు జోనల్‌ జట్ల మధ్య జరిగే దులీప్‌ ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీ (లిస్ట్‌ ఎ) (జూలై 24 నుండి ఆగస్టు 3 వరకు), ఇరానీ కప్‌ (అక్టోబర్‌ 1-5), సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ పురుషుల టీ20 జాతీయ ఛాంపియన్‌షిప్‌లు (అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 6వరకు) జరుగుతాయి.

విజయ్‌ హజారే ట్రోఫీ (నవంబర్‌ 23-డిసెంబర్‌ 15). రంజీ ట్రోఫీ పురుషుల సీనియర్‌ క్యాలెండర్‌లో జనవరి 5 నుండి ఫిబ్రవరి 19 వరకు ఎలైట్‌ గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లతో చివరి టోర్నమెంట్‌, నాకౌట్‌ రౌండ్‌ ఫిబ్రవరి 23 నుండి మార్చి 14 వరకు ఉంటుంది. టోర్నీ వ్యవధి 70 రోజులు. ప్లేట్‌ గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జనవరి 5 – ఫిబ్రవరి 5 మధ్య జరుగుతాయి. నాకౌట్‌ రౌండ్‌ ఫిబ్రవరి 9-22 వరకు నిర్వహిస్తారు.

మహిళల క్రికెట్‌ అక్టోబర్‌ 19 నుండి..

సీనియర్‌ మహిళల సీజన్‌ అక్టోబర్‌ 19 నుండి నవంబర్‌ 9 వరకు జాతీయ టీ20 ఛాంపియన్‌షిప్‌లతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నవంబర్‌ 24 నుండి డిసెంబర్‌ 4 వరకు ఇంటర్‌-జోనల్‌ టీ20 ట్రోఫీ జరుగుతుంది. దీని తర్వాత సీనియర్‌ మహిళల వన్డే ట్రోఫీ జనవరి 4-26 మధ్య ఆడబడుతుంది. సీనియర్‌ మహిళల టీ200 ట్రోఫీ, వన్డే ట్రోఫీలో ఐదు గ్రూపులు ఉంటాయి. గ్రూప్‌ మ్యాచ్‌ల తర్వాత, జట్లకు వారి పాయింట్లు/విజయాల ఆధారంగా 1-10 ర్యాంక్‌ ఉంటుంది. 1-6 ర్యాంక్‌లో ఉన్న జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి, 7-10 ర్యాంక్‌లో ఉన్న నాలుగు జట్లు మిగిలిన రెండు స్లాట్‌లను నిర్ణయించడానికి ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌ రౌండ్‌ను ఆడతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement