Saturday, May 4, 2024

క‌భీ ఖుషీ క‌భీ గ‌మ్ కు ఇర‌వై ఏళ్లు

కుటుంబ కథా చిత్రం అంటే ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్ క్లాసిక్ కభీ ఖుషీ కభీ గమ్… కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతను ఈ చిత్రంలో అత్యద్భుతంగా చూపించారు. నేటికీ ఈ చిత్రం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూనే ఉంటారు. కభీ ఖుషీ కభీ గమ్ సినిమా విడుదలై ఇప్పటికీ 20ఏళ్లు పూర్తయ్యింది. 2001లో విడుదలైన ఈ సినిమాకు కరణ్ జోహార్ దర్శకత్వం వహించగా, యశ్ జోహార్ నిర్మించాడు. ఈ సినిమాలో అమితాభ్ బచ్చన్, జయ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజల్, హృతిక్ రోషన్, కరీనా కపూర్‌లు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాలో రాణీ ముఖర్జీ అతిథిపాత్రలో మెరిశారు. ఈ సినిమాలోని పాటలకు జతిన్ లలిత్, సందేశ్ శాండిల్య, ఆదేశ్ శ్రీవాత్సవలు సంగీతాన్ని సమకూర్చగా, బబ్లూ చక్రవర్తి నేపథ్య సంగీతాన్ని అందించారు. పాటలను సమీర్, అనిల్ పాండేలు రచించారు. ఒక భారతీయ కుటుంబం తాము దత్తత తీసుకున్న కుమారుని పెళ్ళి విషయంలో పడిన అపోహల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. పూర్తిగా ఫ్యామిలీ సబ్జెక్టు పాత్ర అయిన ఈ మూవీ గత రికార్డులను బద్దలుకొట్టి బాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ రిలీజై 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా నెటిజన్లు ఈ సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాలోంచి ఒక ముక్క మీకోసం అంటూ క‌ర‌ణ్ జోహార్ ఈరోజు కూ యాప్ లో పోస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement