Friday, May 3, 2024

పెళ్లిళ్ల సీజన్‌కు టీఎస్‌ఆర్టీసీ 10 శాతం ప్రత్యేక రాయితీ.. జూన్‌ 30 వరకు వర్తింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ ప్రకటించింది. సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఆకర్శించేందుకు టీఎస్‌ ఆర్టీసీ రాయితీలు ప్రకటిస్తున్నది. అన్ని రకాల సర్వీసులపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అద్దె బస్సులపై జూన్‌ 30 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో కార్తీక మాసం, వన భోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు టీఎస్‌ ఆర్టీసీ రాయితీ కల్పించింది. గత ఏడాది డిసెంబర్‌ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది.

- Advertisement -

తాజాగా, పెళ్లిళ్ల సీజన్‌ రావడంతో డిమాండ్‌ దృష్ట్యా 10 శాతం రాయితీ కల్పించాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచనలు చేశారు. శుభ కార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడొద్దనే అద్దె బస్సులపై 10 శాతం రాయితీ ప్రకటించినట్లు టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి విసి సజ్జన్నార్‌ తెలిపారు. ప్రైవేట్‌ వాహనాల కన్నా చాలా తక్కువ ధరకే తమ సంస్థ బస్సులను అద్దెకు ఇస్తోందని పేర్కొన్నారు.

ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్‌ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని వివరించారు. అద్దె బస్సుల బుకింగ్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ టీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ను సందర్శించాలని సూచించారు. పెళ్లిళ్లకు తమ అద్దె బస్సులను వినియోగించుకుని టీఎస్‌ ఆర్టీసిీని ప్రోత్సహించాలనీ, డిమాండ్‌ను బట్టి అద్దె బస్సలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement