Wednesday, September 18, 2024

TS | ఇంటర్ 2024-25 అకడమిక్ క్యాలెండర్‌ విడుదల..

తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కళాశాలలకు ఈ క్యాలెండర్ వర్తించనుంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి వెల్లడించారు. ఈ మేరకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను బోర్డు ఈరోజు విడుదల చేసింది.

తెలంగాణ ఇంటర్ అకడమిక్​ ఇయర్ (​2024-25) క్యాలెండర్ ​..

  • అక్టోబర్ 6 -13 వరకు దసరా సెలవులు.
  • నవంబర్‌ 18 – 23 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు.,
  • 2025 జనవరి 11 -16 వరకు సంక్రాంతి సెలవులు.
  • జనవరి 20 – 25 వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు.
  • ఫిబ్రవరి మొదటివారంలో ప్రాక్టికల్స్‌ పరీక్షలు.
  • మార్చి మొదటి వారం థియరీ పరీక్షలు.
  • ఇక మార్చి 29తో విద్యాసంవత్సరం క్యాలెండర్‌ ముగుస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. మార్చి 30 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఇక 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని వెల్లడించారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement