Sunday, June 16, 2024

Crime : ట్రక్కు, బస్సు ఢీ… 11మంది మృతి

ట్ర‌క్కు, బ‌స్సు ఢీకొని 11మంది మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీలోని షాజహన్‌పుర్‌ జిల్లాలోని ఖుతర్‌ వద్ద ఇవాళ‌ తెల్లవారుజామున ట్రక్కు, బస్సు ఢీ కొన్న ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఖుతర్ వద్ద ఇవాళ‌ తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేం అక్కడికి వెళ్లాం. అప్పటికే స్పాట్లో కొంతమంది చనిపోయి ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాం. అందులో కొందరు చికిత్స పొందుతూ మరణించారు. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగం వల్లనో లేదా నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం వల్లో ఈ ఘటన జ‌రిగి ఉంటుందని మేం ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం.’ అని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement