Sunday, June 16, 2024

TS : రాజ శ్యామల యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్…

ప్రభ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రగతి విద్యాలయ ప్రాంగణంలో లోక కళ్యాణర్థం నిర్వహిస్తున్న రాజ శ్యామల మహాయాగంలో ఆదివారం బిజెపి ఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. మహాయాగం రెండవ రోజు వేద పండితులు, రుత్వికులు గణపతి పూజ, కర్మణ పుణ్యా వచనం, స్థాపిత దేవత ఆరాధన, సుదర్శన రాజశ్యామల మంత్ర అనుష్టానం, శత చండీ పారాయణం నిర్వహించారు.

- Advertisement -

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రుత్వికులు , వేద పండితులు అనుగ్రహ శాసనంతో ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వాకులాభరణం ఆదినాథ్, వేద వ్యాస్, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement