Sunday, April 21, 2024

Editorial : దివ్యాస్త్రతో చైనాలో వణుకు…

దివ్యాస్త్ర పేరిట జరిపిన అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయ వంతం కావడంతో చైనాలో గుబులు బయలు దేరింది. చైనా వద్ద ఉన్న డాంగ్‌ పెంగ్‌ తదితర క్షిపణుల రేంజి కన్నా దీని స్థాయి ఎక్కువ. ఒకే క్షిపణితో ఒకటికి మించిన లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. అందుకే, దీనికి దివ్యాస్త్రం అని పేరు పెట్టారు.ఈక్షిపణి ప్రయోగా న్ని స్వయంగా పరిశీలించేందుకు బంగాళా ఖాతంలోకి చైనా తన నిఘా నౌకలను పంపింది.

- Advertisement -

విశాఖ నుంచి 400 కిలోమీటర్ల దూరానికి చైనా నిఘా నౌక చేరుకుంది. అంతకుముందే మాల్దివులకు పశ్చిమాన చైనా నిఘా నౌక తిష్ట వేసింది. భారత్‌పై నిఘా కోసమే మాల్దివులతో చైనా సంబంధాలను పెంచుకున్నదన్న వార్తలు యధార్ధ మని ఇప్పుడు తేలింది. మాల్దివుల కొత్త అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు ఇటీవల భారత్‌కి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలను బట్టి ఆయన పూర్తిగా చైనా ఒత్తిడికి లొంగిపోయారని స్పష్టం అవుతోంది. చైనా నుంచి షియాంగ్‌ యంగ్‌ హంగ్‌ నౌక గత నెల 23వ తేదీనే బయ లుదేరింది. అది సరిగ్గా అగ్ని ప్రయోగానికి ముందు రోజున బంగాళాఖాతంలో ప్రవేశించింది. అగ్ని లక్ష్యాల ను తెలుసుకోవడమే ఈ నౌకను బంగాళాఖాతంలోకి పంపడంలోని ముఖ్యోద్దేశ్యం. అయితే, అగ్ని క్షిపణి ద్వారా మన దేశం సాధించాలనుకున్న లక్ష్యాలు శత్రు దేశాలనుంచి వచ్చే దాడులను ఎదుర్కోవడమే.

రక్షణ రంగంలో మన దేశం మొదటినుంచి స్వీయ రక్షణ కోసమే ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అగ్ని-5 పరీక్షను మన దేశం రహస్యంగా ఏమీ చేయలేదు. ఇందు కు సంబంధించిన నిబంధనల ప్రకారమే నోటీస్‌ టు ఎయిర్‌ మిషన్‌ను ఈనెల 7వ తేదీన జారీ చేసింది. దీంతో బంగాళా ఖాతంలో 3,500 రేంజిలో నౌకలను, విమానా లను నియంత్రించింది. చైనా, ఉత్తర కొరియాల మాదిరిగా ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఇటువంటి క్షిపణి ప్రయోగాలను మన దేశం ఎప్పుడూ చేయలేదు. చేయదు కూడా. బంగాళా ఖాతంలోకి చైనా పంపిన షియాంగ్‌ యంగ్‌ హంగ్‌ నౌక అగ్ని క్షిపణి ప్రయోగాన్ని అంచనా వేసింది. భారత్‌ సామర్ధ్యం ఏమిటో తెలుసుకు న్నది. రేంజి సామర్ధ్యాన్ని కూడా అంచనా వేసింది. అయితే, చైనా మాత్రం ఇది పరిశీలక నౌక అనిబుకాయి స్తోంది. చైనా మన దేశం చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాల ను లోబర్చుకోవడానికి ఇప్పటికే చేయవల్సిందంతా చేసింది.ఇంకా చేస్తోంది. తాజాగా మాల్దివుల్లో కొత్త ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది.

అగ్ని -5 క్షిపణి రేంజి ఐదువేల కిలోమీటర్ల కన్నా ఎక్కువని చైనా నిపుణులు విశ్వసిస్తున్నారు. అందుకే, దీని కచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి షియాంగ్‌ యంగ్‌ హంగ్‌ నౌకను బంగాళాఖాతంలోకి పంపారు. చైనా నిఘా నౌకల కదలి కల గురించి మన దేశానికి ముందే తెలుసు. అందుకే, అగ్ని-5 ప్రయోగానికి ముందే నోటీసు ఇచ్చింది. ఇలాం టి విషయాల్లో చైనా మాదిరిగా కుయుక్తులు, కుట్రలు చేయాల్సిన అవసరం భారత్‌కి లేదు. అన్ని రంగాల్లో భారత్‌ అభివృద్ధి సాధించడం చైనాకు కంటకింపుగా ఉంది.అందుకే, సరిహద్దుల్లో, సాగర జలాల్లో, తన హద్దులను దాటి చైనా దురాక్రమణ ధోరణిలో వ్యవహరి స్తోంది. భారత్‌ చంద్రయాన్‌-3 ప్రయోగం కూడా చైనా కు గుబులు పుట్టించింది. భారత్‌ని నేరుగా ఎదుర్కొనే శక్తి లేకనే అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదాన్ని పదే పదే లేవనెత్తుతోంది. సాగర జలాల్లో నిఘా నౌకలను చైనా పంపడం ఇది కొత్త కాదు. 2022లో కూడా చైనాకి చెంది న యువాన్‌ వాంగ్‌ నౌకను హిందూ మహాసముద్రంలోకి పంపింది.

అగ్ని క్షిపణిప్రయోగాన్ని అప్పట్లో మన దేశం వాయిదా వేసింది. ఈసారి కూడా అలా చేస్తుందే మోనని చైనా అనుకున్నది కానీ, మన దేశం ముందుగా నే హెచ్చరికను జారీ చేయడం వల్ల చైనానిఘా నౌకలు నిదానంగా చేరుకున్నాయి. చైనా వద్ద 64 పరిశోధక, సర్వేనౌకలు ఉన్నాయనీ, వీటి కదలికలు ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటాయని అమెరికాకి చెందిన థింక్‌ ట్యాంక్‌ సిఎస్‌ఎస్‌ రెండు నెలల క్రితమే వెల్లడించిం ది. చైనా చెబుతున్నట్టు ఇవి పరిశీలక నౌకలు కావు. నిఘా నౌకలే. వీటి ద్వారా నిఘా పెంచడం కోసమే శ్రీలంక, మాల్దివులను చైనా మచ్చిక చేసుకుని వాటికి అవసరమైన సాయాన్ని అందిస్తోంది. చైనా అందించే సాయం ఎప్పు డూ స్వీయప్రయోజనంకోసమేనని మన దేశం చాలా సార్లు స్పష్టం చేసింది. శ్రీలంకలో హంబటోటా నౌకాశ్ర యానికి సాయం అందించడం పేరిట దానిని పూర్తిగా సొంతంచేసుకుంది. అలాగే,ఇప్పుడు మాల్దివులకు సాయం అందిస్తోంది. చైనా ఉచ్చులో పడిన ఏ దేశమూ సులభంగా బయటపడిన దాఖలాలు లేవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement