Tuesday, May 28, 2024

WGL: విద్యుత్ షాక్ తో… ఆర్టీసీ డ్రైవర్ మృతి

పొలం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను తాకడంతో షాక్ తో ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని దామెర మండల పరిధిలోని లేదళ్ల శివారులో దామెర గ్రామానికి చెందిన పోతుల కుమార్ అనే రైతు మొక్కజొన్న, మునగ, పంటలకు అడవి పందుల నుండి రక్షణగా అమర్చిన విద్యుత్ వైర్లను తాకడంతో దామెర గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మెరుగు సంపత్(48) విద్యుత్ ఘాతంతో రాత్రి సమయంలో చనిపోయాడు.

మృతునికి భార్య రేణుక, కూతురు, కుమారుడు ఉన్నారు. విషయం తెలిసిన పరకాల ఏసీపీ కిషోర్ కుమార్, పరకాల రూరల్ సిఐ రంజిత్ రావు ఘటన స్థలానికి చేరుకొని డెడ్ బాడీని ఎంజిఎంకు పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement