Monday, May 6, 2024

కోటి వృక్షార్చనలో ప్రతీ ఒక్కరు పాల్గొనండి – ప్రజలకు ఎర్రబెల్లి పిలుపు..

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా జరుగనున్న కోటి వృక్షార్చనలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఈనెల 17న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని త‌న నివాసంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కోటి వృక్షార్చన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఆదర్శమూర్తి సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం హరితహారం కార్యక్రమం చేపట్టారని వెల్లడించారు. 2015లో ప్రారంభమైన హ‌రితహారం కార్యక్రమం ద్వారా ఇప్పటి వ‌ర‌కు 230 కోట్ల మొక్కలు నాటామన్నారు. అట‌వీశాఖ అధికారుల లెక్కల ప్రకారం 4 శాతం పచ్చదనం పెరిగిందని చెప్పారు. హ‌రితహారం కార్యక్రమం విజ‌య‌వంతమయ్యిందనడానికి ఇదే నిద‌ర్శమన్నారు. ప్రపంచ ప‌ర్యావ‌ర‌ణానికి, మాన‌వ క‌ళ్యాణానికి నిర్వహిస్తున్న కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములవ్వాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞతా పూర్వక బ‌హుమ‌తిని అందిద్దామని చెప్పారు. ‌ఈ స‌త్కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయ‌తీల స‌ర్పంచ్‌లు, ఉప స‌ర్పంచ్‌లు, వార్డు మెంబ‌ర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. కాగా, తన స్వగ్రామమైన అనుములకు మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు ఇంకా రాలేద‌న్న జానారెడ్డి మాట‌ల‌ను మంత్రి తీవ్రంగా ఖండించారు. న‌ల్లగొండ జిల్లాలో గ‌త మూడేండ్ల నుంచి ప్రతీ ఇంటికి మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు వ‌స్తున్నాయని చెప్పారు. జానారెడ్డి ఇంటికి కూడా మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు ఇస్తున్నాని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement