Thursday, April 25, 2024

ప్రియుడితో విడిపోనున్న ‘సుస్మిత’

బాలీవుడ్ హీరోయిన్. మాజీ విశ్వ సుందరి  సుస్మితసేన్..రోహ్మాన్ 2018నుండి డేటింగ్ చేస్తున్నారు. 45ఏళ్ల ఈ మాజీ విశ్వ సుందరి రోహ్మన్ షాల్ అనే 30ఏళ్ల యువ మోడల్ తో ప్రేమలో పడింది.  ఎప్పటికప్పుడు జంట రొమాన్స్ కి సంబంధించిన ఫోటోల్ని వీరు సోషల్ మీడియాల్లో రివీల్ చేశారు. అయితే తాజా క్రిప్టిక్ పోస్ట్ ఆమె బాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్ నుంచి విడిపోతున్నాననే సిగ్నల్ ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. సుస్మితా కఠినమైన సందేశాన్ని ఇస్తూ తెరపైకి రావడం ప్రకంపనాలకు తెర తీసింది.  సుష్మిత తన ఇన్ స్టాగ్రామ్ లో తన కోపాన్ని దాచుకోకుండా బహిర్గతం చేసింది. `మామ్… ప్లీజ్ మీరు విడిపోయారని నాకు చెప్పకండి. మీరు పెళ్లి చేసుకుంటారని నేను ఎదురుచూస్తున్నాను అని ఓ అభిమాని ఆవేదనగా వ్యాఖ్యానించారు. మీ భాగస్వామితో అంతా బాగానే ఉందని నేను నమ్ముతున్నాను అని ఒక యూజర్ రాశాడు. మరి ఏమవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement