Saturday, May 18, 2024

పశువులను ఢీకొంటున్న రైళ్లు.. గ‌త నెల రోజుల్లోనే 200 ఘ‌ట‌న‌లు

రైల్వే ట్రాక్‌లపైకి చేరుకుంటున్న పశువులతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గతనెల మొదటి 9 రోజుల్లో దాదాపు 200 ఘటనల్లో రైళ్లు పశువులను ఢీకొన్నాయి. గత 10నెలల కాలంలో ఇలాంటి ఘటనలు 4000 వరకు చోటుచేసుకున్నాయి. వందేభారత్‌ రైలుకు మూడుసార్లు పశువులు అడ్డొచ్చాయి. ఇలాంటి ప్రమాదాలను నిలువరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రైల్వేశాఖ అధికారి అమితాబ్‌ శర్మ తెలిపారు. 2020-21లో దేశవ్యాప్తంగా రైళ్లు పశువులను ఢీకొట్టిన ఘటనలు 26,000 జరగ్గా, అందులో నార్త్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలో 6500, నార్త్‌ జోన్‌ పరిధిలో 6800 ఘటనలు జరిగాయని పేర్కొన్నారు.

ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ట్రాక్‌కు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో 40శాతం మేర పనులు పూర్తయినట్లు చెప్పారు. అయితే, దారిపొడవునా ఇలాంటి బారికేడ్ల ఏర్పాటు సాధ్యం కాదన్నారు. సాధారణంగా ట్రాక్‌కు చేరువలో డెయిరీ ఫామ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement