Tuesday, July 23, 2024

Kalki trailer | ప్రభాస్ ‘కల్కి’ సినిమా ట్రైలర్ వచ్చేసింది..

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో బౌంటీ హంటర్‌గా ప్రభాస్ చేసిన సాహసాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్‌లో ప్రభాస్ కనిపించిన తీరు సంచలనం రేపుతోంది. ఇక అశ్వథామ పాత్రలో అమితాబ్ బచ్చన్, కీల‌క‌ పాత్రలో దీపిక కనిపిస్తూ.. ఇక ‘భయపడుకు మరో ప్రపంచం వస్తోంది’ అంటూ చివర్లో కమల్ హాసన్ చెప్పే డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ వాహనం బుజ్జి టీజర్ ఇప్పటికే విడుదలై.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించింది.

YouTube video

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్‌గా తెరకెక్కుతుండగా.. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని కీలక పాత్రలు పొషించారు. ఇక అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement